బాలయ్య కోసం స్ర్కిప్టు సిద్ధం చేసిన పూరి!


పూరి జగన్నాథ్‌ - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్‌’ బాగానే ఆకుట్టకుంది. ప్రస్తుతం మరోసారి బాలకృష్ణతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమైయ్యారని సమచారం. అందుకోసం స్ర్కిప్టు కూడా చేసుకొన్నాడు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే లాక్‌డౌన్‌ పూర్తికాగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా తరువాత బాలకృష్ణ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గతంలో బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చే సినిమా, బోయపాటి చిత్రం పూర్తి అయిన తరువాత చేస్తారని వార్తలొచ్చాయి. తాజాగా ఆ స్థానంలో పూరి జగన్నాథ్‌ చిత్రం తెరపైకి వచ్చింది. ఈలోపు పూరి దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’‌ చిత్రం చిత్రీకరణ కూడా ఓ కొలిక్కి రావచ్చు. ఏదైతేనేం మరోసారి బాలయ్యలోని మాస్‌ని పూరి జగన్నాథ్‌ బయటకు తెస్తాడని యన్‌బీకే అభిమానులు ఆశిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.