నేను హృదయపూర్వకంగా దక్షిణాది అమ్మాయినే

నిధి అగర్వాల్‌ పేరు ఉత్తరాది అయిన తను నటించినా సినిమాల్లో దక్షిణాది చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో అక్కినేని కుటుంబ హీరోలతో కలిసి ‘సవ్యసాచి’ ‘మిస్టర్‌ మజ్ను చిత్రాల్లో నటించింది. ఇక రామ్‌ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్‌ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో జయం రవి సరసన భూమి చిత్రంలో నటిస్తుంది. ఆ మధ్య నిధి తమిళం నేర్చుకుంటూ కనిపించింది. ఒక వైపు తమిళ పదాలు, మరోవైపు ఇంగ్లీష్‌ పదాలు పెట్టుకొని సరిచూసుకుంటూ తమిళం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నేను హైదరాబాద్‌లో పుట్టిన పెరిగిందంతా బెంగళూరులోనే. మేం బెంగళూరులోనే ఉన్నప్పుడు మాపక్కింట్లో ఉండేవాళ్లంతా తమిళం చెందినవాళ్లు. దాంతో నేను తరచూగా మాట్లాడేదాన్ని వాళ్లు మాట్లాడే తమిళం నాకు అర్థమయ్యేది. కానీ చెప్పలేను. తరువాత అక్కడ నుంచి వేరోచోటికి వెళ్లాను. అయితే నేను ఇప్పటికీ మనస్ఫూర్తిగా దక్షిణాది అమ్మాయినే’’ అని అంటోంది. ఇక తెలుగులో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మహేష్‌ మేనల్లుడు గల్లా అశోక్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.