నిఖిల్‌ సరసన ‘ఉప్పెన’ నాయిక?

‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌ ధక్‌ ధక్‌’.. ఈ రెండు పాటల్లో కనిపించి యువతను ఆకట్టుకున్న భామ కృతిశెట్టి. ఈ అమ్మడి హావభావాలు ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడుగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ‘ఉప్పెన’ చిత్రంలోని గీతాలివి. ఈ చిత్రంతో నాయికగా పరిచయమవుతోంది కృతి. ఈ సినిమా విడుదలకు ముందే మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుందట. అదేంటంటే? నిఖిల్‌ హీరోగా దర్శకుడు సూర్య పల్నాటి ‘18 పేజెస్‌’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కథ, స్క్రీన్‌ప్లే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాయికగా కృతిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ సినిమాలో కృతి నటనను మెచ్చిన సుకుమార్‌ ఈ అవకాశం ఇచ్చాడని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మరోవైపు మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ ‘ఉప్పెన’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.