కోలీవుడ్‌కు ‘నిన్నుకోరి’?

నాని, నివేదా థామస్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నిన్నుకోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథ తెలుగులో మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాని పాత్రలో అధర్వ మురళీ, నివేదా స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తారని టాక్‌. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి ఈ ఆది పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఈ రీమేక్‌పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలోని సంగీతమూ బాగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌లో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. మరోవైపు కన్నడలోకి కూడా రీమేక్‌ కానుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే స్పష్టత రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.