మూగ ఆర్టిస్ట్‌గా అనుష్క
‘భాగమతి’ చిత్రం తర్వాత సుమారు రెండేళ్లు విరామం తీసుకున్న అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని అనుష్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అనుష్క పెయింటింగ్‌ వేస్తూ కనిపిస్తుంది. ఇందులో స్వీటీ క్యూట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో ‘సాక్షి’ అనే మాటలు రాని ఆర్టిస్ట్‌గా కనిపించబోతుంది అనుష్క. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. శరవేగంగా పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరి మూగ ఆర్టిస్ట్‌గా అనుష్క ఎలాంటి సవాళ్లు ఎదుర్కుందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.