ఆసుపత్రిలో చేరిన హిందీ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్‌

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ - టబు, శ్రియ శరణ్‌, ఇషితా దత్‌ కలిసి నటించిన చిత్రం ‘దృశ్యం’. నిషికాంత్‌ కామత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. కామత్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిషికాంత్‌ గతంలోనే లివర్‌ సిర్రోసిస్‌తో బాధపడ్డారు. ఇప్పుడే అదే వ్యాధి తిరగబెట్టిందట. నిషికాంత్‌ తమిళం, బాలీవుడ్‌, మరాఠి చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. దర్శకత్వంతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. జాన్‌ అబ్రహాం, శ్రుతిహాసన్‌ నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి అలరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.