మూడు రకాలుగా కనిపించనున్న నితిన్‌

'జయం’ లాంటి ప్రేమకథా చిత్రంలో నటించి అలరించిన హీరో నితిన్‌. ఆ తరువాత తనదైన పాత్రల్లో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. నితిన్‌ ప్రస్తుతం 'రంగ్‌ దే' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట అనే చిత్రంలో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నితిన్‌ మూడు రకాలుగా కనిపించనున్నాడట. అంటే 1960 నుంచి 2020 వరకు మధ్యలో చిత్ర కథ ఉంటుందట. ఇందులో నితిన్‌ 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా, ఆ తరువాత 60 వృద్ధుడిగాను కనిపించనున్నారు. ఈ పాత్రల మేకప్‌ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకురానున్నారని సమాచారం. చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ నటించనుంది. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్‌ బాలీవుడ్‌లో వచ్చిన ‘అంధాదూన్’‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.