థ్రిల్లర్‌ కథతో తెలుగు తెరపైకి నిత్య

విలక్షణ కథానాయిక నిత్యామేనన్‌ తెలుగు తెరపై సందడి చేసి చాలా కాలమే అయింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘అ’ తర్వాత.. ఆమె పూర్తిస్థాయిలో తెలుగులో మరే చిత్రమూ చెయ్యలేదు. ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో తళుక్కుమనిపించింది. అయితే ఇన్నేళ్ల విరామం తర్వాత నిత్యా తెలుగు తెరపై సందడి చేసేందుకు ముస్తాబవుతోన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో కొన్ని చిత్రాలకు పని చేసిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథకు ఆమె పచ్చజెండా ఊపిందని సమాచారం. ఇదొక పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందబోయే చిత్రమని, లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.