ఇటలీకి పయనమవుతున్నారా?

ప్రభాస్‌ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్‌’ ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా వస్తోన్న ‘రంగ్‌ చిత్రం సైతం ఇటలీలో షూటింగ్‌ చేసేందుకు సిద్ధమైంది చిత్ర బృందం. లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాద్‌లో పునఃప్రారంభమైన ఈ చిత్రం కొన్ని షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. పాటలు, కీలక సన్నివేశాల కోసం ఈ నెల 25న ‘రంగ్‌ దే’ బృందం ఇటలీకి పయనమవుతుందని సమాచారం. ఇటలీలోని ప్రసిద్ధి చెందిన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.