నితిన్‌ కోసం త్రివిక్రమ్‌

యువ కథానాయకుడు నితిన్‌ నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక నాయిక. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ముందస్తు విడుదల వేడుక నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 17న జరగనుంది. ఈ కార్యక్రమానికే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గతంలో నితిన్‌ హీరోగా త్రివిక్రమ్‌ ‘అఆ’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తిపెరిగింది అందరిలో. ఇప్పుడు నితిన్‌ సినిమా వేడుకకు త్రివిక్రమ్‌ వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.