కన్నడ నిర్మాత ఎన్‌ఎల్‌ఎన్‌ మూర్తి కన్నుమూత

కన్నడ నిర్మాత ఎన్‌ఎల్‌ఎన్ మూర్తి కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన శుక్రవారం 39 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ప్రముఖ నటుడు రాజ్‌ కుమార్‌ మనవడు వినయ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తోన్న ‘గ్రామాయణ’ చిత్రానికి నిర్మాతగా మూర్తి వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎల్‌ఎన్ మూర్తి పలు నాటకాల్లో నటించారు. రెండేళ్ల క్రితం వినయ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా ‘గ్రామాయణ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌, టీజర్‌ విడుదలై అభిమానులను అలరించాయి. ఈ సినిమా చిత్రీకరణ కూడా దివంగత నటుడు రాజ్‌కుమార్‌ జన్మించిన ఊరిలోనే తీశారు. మొత్తం మీద చిన్న వయసులోనే కన్నుమూయడం చాలా బాధాకరమని కన్నడ చిత్రబృందం సానుభూతిని వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు కన్నడ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.