‘ఎన్టీఆర్‌’లో రకుల్‌!

నందమూరి తారక రామారావు జీవితకథను ‘ఎన్టీఆర్‌’గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో విద్యాబాలన్‌, రానా, సచిన్‌ కేడేకర్‌, కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించే అవకాశం దక్కించుకొంది. అప్పట్లో ఎన్టీఆర్‌, శ్రీదేవిలు తారాగణంగా ‘గజదొంగ’ వంటి చిత్రాలు విజయం సాధించాయి. అందుకే ఈ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రధారిణినిగా రకుల్‌ను ఎంపిక చేశారు. త్వరలో చిత్రీకరణలో రకుల్‌ పాల్గొంటుదని సహనిర్మాత విష్ణు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.