‘ఎన్టీఆర్‌’ కోసం భారీ ఆఫర్‌!

మహానటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ దృశ్యకావ్యంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నాడు. పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కీలకపాత్రల్లో తళుక్కున మెరవబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ బయోపిక్‌ హక్కుల కోసం అప్పుడే తెర వెనుక ప్రయత్నాలు మొదలైయిపోయాయి. సంక్రాంతి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర హక్కుల కోసం ఇప్పటికే ఇటు స్థానికంగా అటు ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోందట. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్‌’ ఓవర్సీస్‌ హక్కుల కోసం ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రికార్డు స్థాయిలో రూ.12 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.