అప్పుడు అత్తా అల్లుడిగా.. ఇప్పుడు?

‘నా అల్లుడు’ చిత్రంలో అత్తా అల్లుడిగా అలరించిన రమ్యకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ మరోసారి కనువిందు చేయబోతున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తారక్‌ ఓ చిత్రానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనుంది. హాసిని అండ్‌ హారిక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోనే రమ్యకృష్ణ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ మహిళల పాత్రల్ని శక్తివంతంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నదియా, టబు.. తదితరులు పోషించిన పాత్రలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జాబితాలో రమ్యకృష్ణ నిలవనున్నారని వినికిడి. ‘ఎన్టీఆర్‌ 30’లో కీలకమైన పాత్ర ఒకటుందని, రమ్యకృష్ణ అయితే బావుంటుందని భావించిన చిత్ర బృందం ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుందట. పదిహేనేళ్ల క్రితం అత్తా అల్లుడిగా అలరించిన ఈ కలయిక ఇప్పుడు ఏ పాత్రలతో ఆకట్టుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.