పవన్‌తో నిధి అగర్వాల్‌?

సినీ ప్రియుల దృష్టంతా పవన్‌ కల్యాణ్‌ సరసన నటించే నాయికలపైనే ఉంది. ఆయన ఎవరితో ఆడిపాడతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్‌ రెండు చిత్రాలు మొదలు పెట్టినా ఇప్పటికీ వాటిల్లో హీరోయిన్లు ఎవరో స్పష్టత రాలేదు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ నిధి అగర్వాల్‌ పేరు వినిపిస్తుంది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో మ³ందుగా బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షి సిన్హాని అనుకున్నా, పలు కారణాల వల్ల ఆమె నటించట్లేదని టాలీవుడ్‌ టాక్‌. ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ పేరు తెరపైకి వచ్చింది. కానీ, చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు ఆ స్థానం నిధికి దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.