ఆయన తమ్ముణ్ని కావడం దేవుడిచ్చిన వరం

‘అబ్దుల్‌ కలాం చెప్పినట్లు.. కలలు కనాలి. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి అనే సత్యానికి చిరంజీవి ప్రస్థానం నిదర్శనమ’ని ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి గురించి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ ట్విటర్‌ వేదికగా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం, త్వరలో విడుదల కానున్న ‘సైరా’ చిత్రంలో చిరంజీవి నటన గురించి ప్రస్తావించారు. ‘ఆయన జీవితమొక సందేశం. ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకు మించి ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం’ అని పవన్‌ తన మనసులో మాటను అభిమానలముందుంచాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.