
తెలుగు నటుడు పవన్ కల్యాణ్ ఊసరవెల్లిలాంటి వాడు అని చెబుతున్నారు నటుడు ప్రకాష్‌రాజ్. తాజాగా ఆయన ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ..‘‘హైదరాబాద్ మేయర్ ఎన్నికల విషయంపై పవన్ తీసుకున్న నిర్ణయం నాకు చాలా నిస్సారంగా అనిపించింది. ఆయన ప్రముఖ రాజకీయనాయకుడి అయ్యి కూడా మరో పార్టీ నాయకుడిని బలపరచడం నాకు సుతారము నచ్చలేదు. నాపై ఎంతమంది విమర్శలు చేసినా పట్టించుకోను. కానీ పవన్ ఓ పార్టీకి అధినేత అనే విషయంతో పాటు, తను నాయకుడనే విషయాన్ని సైతం మరచిపోతున్నారు. గడిచిన కాలంలో బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికి తెలుసు. అలాంటి పార్టీతో పవన్ పొత్తుపెట్టుకోవడం ఏంటో నాకస్సలు అర్థం కావట్లేదు. గడిచిన 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. అంతకు ముందు జరిగిన 2014 ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కమలం పార్టీని, టీడీపిలను విమర్శించారు. తిరిగి మళ్లీ ఇప్పుడు వద్దనుకున్న బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటే పోతే ఆయన చేసే రాజకీయాలను ఊసరవెల్లి రాజకీయాలని ప్రజలు భావిస్తారు అంటూ’’ చెప్పారు. ఇక ఈ విషయంపై పవన్ సోదరుడు నాగబాబు ప్రకాష్‌రాజ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు ఈ దేశానికి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేనలాంటి పార్టీతోనే అభివృద్ధి ఉంటుంది. నీలాంటి మేధావులు ఎన్ని మాటలు అన్నా బీజేపీ, జనసేన కూటమికి ఉన్న శక్తిని ఎవరూ అడ్డుకోలేరు అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.