పవన్‌తో నిధి?

నిధి అగర్వాల్‌, పవన్‌ కల్యాణ్‌ కలిసి నటిస్తున్నారా? అవుననే ప్రచారం సాగుతోంది టాలీవుడ్‌ వర్గాల్లో. పవన్‌ హీరోగా దర్శకుడు క్రిష్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ వివరాలు మినహా నాయిక ఎవరో ప్రకటించలేదు చిత్రబృందం. ఇప్పుడు నిధినే ఈ చిత్రంలో పవన్‌తో కలిసి నటిస్తుందని  వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం ఆమెను సంప్రదించిందని, దాదాపు ఖరారే అని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని టాక్‌. ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో విజయం అందుకుంది నిధి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.