పవన్‌ సరసన ప్రగ్యా?

ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నాడాయన. ఇదిలా ఉండగానే క్రిష్‌ దర్శకత్వంలో మరో చిత్రం మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిష్‌ రాసుకున్న కథకు ప్రగ్యా అయితేనే న్యాయం చేయగలదని భావించడంతో ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరోవైపు.. క్రిష్‌ గతంలో తెరకెక్కించిన ‘కంచె’ చిత్రంలో ప్రగ్యానే కథానాయిక కావడంతో తన నటనను మెచ్చి మరో అవకాశం ఇచ్చారని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ జంటగా ఎవరు కనిపించనున్నారో అతి త్వరలోనే తెలియనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.