ప‌వ‌న్ కోసం బాలీవుడ్ కథానాయికలు?

ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం క్రిష్ ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు ఛాన్సుంది. అందుకోసం బాలీవుడ్ హీరోయిన్ల‌ని సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అక్క‌డి స్టార్ హీరోయిన్‌నే రంగంలోకి దింపాల‌న్న‌ది క్రిష్ ఆలోచ‌న‌. దీపికా ప‌దుకొణె, క‌త్రినా కైఫ్‌, అలియాభ‌ట్‌.. ఇలాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఈ సినిమాని మిగిలిన భాష‌ల్లోనూ విడుద‌ల చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌. అందుకోస‌మే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న న‌టీన‌టుల్ని తీసుకోవాల‌ని భావిస్తున్నారు. క్రిష్ క‌థ‌లో బ‌ల‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఉంటాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కూ కీల‌క‌మైన పాత్ర‌లే ఉన్నాయ‌ట‌. అందుకోస‌మే స్టార్ ఇమేజ్ ఉన్న‌వాళ్ల‌ని తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా క‌థానాయిక‌ల వేట పూర్తి చేయాల‌నుకుంటున్నాడు క్రిష్. అందుకే స్క్రిప్టు వర్క్ న‌డుస్తున్న‌ప్పుడే క‌థానాయిక‌ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసేశాడు. క్రిష్‌కి బాలీవుడ్ తో బాగా ట‌చ్ ఉంది. అందుకే.. త‌న ప‌ని సుల‌భం అవుతుంద‌ని త‌న న‌మ్మ‌కం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.