మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ వచ్చే ఏడాది దీపావళికేనా?

మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’‌. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడు నెలలుగా సినిమా షూటింగ్‌ ఆగిపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్యలు, శరత్‌ కుమార్‌, జయం రవి, శోభ దూలిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని థాయ్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అడవుల్లో చిత్రీకరించాల్సి ఉందట. అందుకే శ్రీలంక దేశంలో షూటింగ్‌ చేయడానికి చిత్రబృందం యోచిస్తుందని సమాచారం. సమారు నెలపాటు సాగే ఈ షెడ్యూలో సెప్టెంబర్‌ 20న శ్రీలంకకు వెళ్తున్నారట. సుహాసిని మణిరత్నం, అలీరాజా సుబకరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.