శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకోనున్న పొన్నియన్‌ సెల్వన్‌‌!

ప్రేమకథా చిత్రాలతో పాటు సమాకాలిన సంఘటనలు ఆధారంగా చేసుకొని వైవిధ్యంగా చిత్రాలు తెరకెక్కించడంలో మణిరత్నం పేరు ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరెకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ని థాయ్‌ల్యాండ్‌లో జరుపుకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంతో సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఐదు నెలల తరువాత తిరిగి సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి చిత్రబృందం సిద్ధమైంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అడవుల్లో చిత్రీకరించాల్సి ఉందట. అందుకే శ్రీలంక దేశంలో షూటింగ్‌ చేయడానికి చిత్రబృందం యోచిస్తుందని సమాచారం. సమారు నెలపాటు సాగే ఈ షెడ్యూలో సెప్టెంబర్‌ 20న శ్రీలంకకు వెళ్తున్నారట. కళాదర్శకుడు తోట తరణి సినిమా కోసం ఇప్పటికే మూడు వేర్వురు స్టూడియోల్లో సెట్స్ ని తయారు చేసే పనిలో ఉన్నారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్యర్య లక్ష్మి, కార్తి, విక్రమ్‌ ప్రభు, శోభ దూలిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో తెలుగు నటుడు మోహన్‌బాబు పోషించనున్నారు. సుహాసిని మణిరత్నం, అలీరాజా సుబకరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.  



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.