ఐశ్వర్యరాయ్‌ కోసం షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్న మణిరత్నం?


ప్రముఖ దర్శకుడు మణిరత్నం పత్రిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్’‌. ఈ సినిమా షూటింగ్‌ గత ఏడాది డిసెంబర్‌లో థాయ్‌ల్యాండ్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండో షెడ్యూల్‌ని పుదుచ్చేరిలో ఫిబ్రవరి 3 నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. ఆరురోజుల పాటు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తరువాత లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌ల కాల్‌షీట్లను ఎక్కువ మొత్తం తీసుకొని పుదుచ్చేరిలో షూటింగ్‌ ప్రారంభించడానికి సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పూర్తైయిన అవుట్‌ డోర్‌ షూటింగ్‌ అంటే అనుమతులు ఇస్తారో లేదో తెలియదు. ఈ పరిస్థితులన్ని గమనించిన చిత్రబృందం చైన్నైలోనే ఇండోర్‌ షూటింగ్‌ చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారట. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్’‌ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జయం రవి, కార్తి, విక్రమ్‌ ప్రభు,త్రిష, శోభ దూలిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు.  సుహాసిని మణిరత్నం, అలీరాజా సుబకరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.