పవన్‌ చిత్రంలో ఐటెమ్‌ భామగా పూజిత!

పూజిత పొన్నాడ అచ్చ తెలుగు అమ్మాయి. తాజాగా పవన్‌ కల్యాన్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుందని సమాచారం. చిత్రంలో పవన్‌ బందిపోటుగా నటించనున్నారట. ఇప్పటికే పవన్‌ చిత్రాలు గమనిస్తే ప్రత్యేక గీతాలు మనకు కనిపిస్తాయి. అవి ఎంత హిట్టయిన సంగతి తెలిసిందే. ఇక పూజిత తొలుత నారా రోహిత్‌తో నటించిన ‘తుంటరి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘రంగస్థలం’ రాజశేఖర్‌ చిత్రం ‘కల్కి’లో నటించి సందడి చేసింది. పూజిత బుల్లితెరపై కూడా సందడి చేసింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.