ప్రభాస్‌ కోసం ఆలియా?

ప్రభాస్‌ కథానాయకుడుగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సరికొత్త కథాంశంతో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని నాయిక విషయంలో ప్రచారం సాగుతోంది టాలీవుడ్‌ వర్గాల్లో. ప్రభాస్‌ కోసం ఆలియా భట్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట అశ్విన్‌. ఈ కథకు ఆమె అయితేనే బావుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయి కావడంతో ఆలియా తీసుకునే అవకాశాలున్నాయని టాక్‌. కొన్ని రోజుల్లో స్పష్టత రావొచ్చు. ప్రస్తుతం ఆలియా చేతిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూభాయి’ చిత్రాలున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక నాగ్‌ అశ్విన్‌ సినిమా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.