సోదరులుగా?

ప్రభాస్, అథర్వ మురళి అన్నదమ్ములుగా కనిపించబోతున్నారా? అవుననే వినిపిస్తుంది చిత్ర సీమలో. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాధేశ్యాం’. ఈ కథలో కథానాయకుడి సోదరుడి పాత్ర చాలా కీలకమట. దానికి న్యాయం చేయాలంటే అనుభవం ఉన్న నటుడైతే బావుంటుందని భావించి అథర్వని సంప్రదించారని సమాచారం. నిడివి ఎంతున్నా.. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు అథర్వ పచ్చజండా ఊపాడని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత రానుంది. ఈ తమిళ నటుడు గతంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్‌’లో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. మరి ఈ సారి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ‘రాధేశ్యాం’ లాక్‌డౌన్‌కి ముందు యూరప్‌లో చిత్రీకరణ .జరుపుకుంది. త్వరలోనే పునఃప్రారంభం కానుంది. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.