సామ్‌ కన్ను ప్రభాస్‌పై పడిందా?

సమంత కన్ను ప్రభాస్‌పై పడిందా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. అలాగని సామ్‌ డార్లింగ్‌తో ఏ సినిమా చేయట్లేదు లేండి. ఇంతకీ ఆమె కన్నేసింది దేని మీదో తెలుసా.. ప్రభాస్‌ కొత్త చిత్రం టైటిల్‌ పైన. ప్రస్తుతం ప్రభాస్‌.. ఎస్‌.రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ‘జాన్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌పై తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్ర టైటిల్‌ను చిత్ర బృందం మార్చబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఈ టైటిల్‌ను తాను కొట్టేయాలని చూస్తోందట సమంత. ప్రస్తుతం ఆమె శర్వానంద్‌తో కలిసి ‘96’ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. అయితే ఈ చిత్రంలో సామ్‌ పాత్ర పేరు కూడా జానునే. కథ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి.. ఒకవేళ ప్రభాస్‌ కనుక ‘జాన్‌’ టైటిల్‌ను వదులుకుంటే ఆ పేరును సామ్‌ చిత్రానికి పెట్టుకోవాలని చూస్తున్నారట నిర్మాత దిల్‌రాజు. ఇప్పటికే ఈ టైటిల్‌పై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో దాన్ని కొట్టేస్తే ‘96’ బృందానికి కలిసొస్తుందనే చెప్పొచ్చు. అయితే ఇదే టైటల్‌ను పెట్టుకుంటారా? లేదా? అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.