ప్రభుదేవా ఫిజియోథెరపిస్ట్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌గా పేరొందిన నృత్యదర్శక నటుడు ప్రభుదేవా. తాజాగా ఓ బీహార్‌కి చెందిన ఓ ఫిజియోథెరపిస్టుని చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి సెప్టెంబర్‌ మాసంలో ముంబైలోని తన ప్రభుదేవా నివాసంలో జరిగింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో ఉంటున్నారని సమాచారం. ప్రభుదేవాకి గతంలో రామ్‌లతను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కానీ 2008లో బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా 12 యేళ్ల విశాల్‌ అనే కుమారుడు చనిపోయాడు. ఆ తరువాత దక్షిణాది నటి నయనతారతోనూ కొన్నాళ్ల పాటు డేటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. నయనతారే 2012లో ప్రభుదేవాతో విడిపోయినట్లు ప్రకటించింది కూడా. ఆ మధ్య ప్రభుదేవా తన మేనకోడలితోనూ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఆ విషయం గురించి అధికారికంగా ఎక్కడా బయటకు రాలేదు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘రాధే: ది మోస్ట్ వాంటెడ్‌ భాయ్‌’‌ అనే చిత్రానికి ప్రభు దర్శకత్వం చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో ‘వాంటెడ్’‌, ‘దబాంగ్‌3’ చిత్రాల్లో నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.