మోహన్‌లాల్‌ సరసన ‘మామాంగం’ భామ?

మలయాళ నటుడు మోహన్‌లాల్, జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో చేయనున్న చిత్రం ‘రామ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న సినిమాలో ప్రాచి టెహ్లాన్‌ నటింనుందని సమాచారం. ప్రాచీ పేరుని మోహన్‌లాల్‌ స్వయంగా ప్రతిపాదించాడని చెప్పుకుంటున్నారు. ప్రాచీ ఇప్పటికే మమ్మూట్టి నటించిన ‘మామాంగం’ చిత్రంలో ఉన్నిమాయ పాత్రలో నటించి మెప్పించింది. ఈ పాత్రకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ‘రామ్‌’ చిత్రంలోని కీలక పాత్రల్లో నటి త్రిష, ఆదిల్‌ హుస్సేన్‌లు నటించనున్నారు. ఆదిల్‌ హిందీలో వచ్చిన ‘కబీర్‌సింగ్‌’ చిత్రంలో కాలేజీ డీన్‌గా నటించారు. ప్రాచి టెహ్లాన్‌ ఒట్టి నటి మాత్రమే కాదు. బాస్కెట్‌బాల్, నెట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా. ఇండియా 54వ నేషనల్‌ గేమ్స్‌లో నెట్‌బాల్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.