అలా హీరోనయ్యా!

ఎప్పుడూ సరికొత్త పంచులతో బుల్లితెరపై సందడి చేస్తుంటారు యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్న దర్శకత్వం వహించారు. అయితే ఇందులో హీరోగా ఎలా అవకాశం వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రదీప్‌. ‘‘నేను యాంకర్‌గా చేసే ఓ షోను చూస్తూ డైరెక్టర్‌ భార్య, అమ్మ ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారంట. ‘నేను తీసే సినిమాలో మహిళల భావాలకు ప్రాధాన్యం ఉంది. నా ఇంట్లోనే ఇద్దరు మహిళలు ఆ యాంకర్‌ను అభిమానిస్తున్నారు. అతన్నే ఎందుకు హీరోగా పెట్టుకోకూడదు’ అంటూ ఆయనకు ఆలోచన వచ్చింది. వెంటనే వచ్చిన కథ చెప్పారు. అలా నేను హీరోగా మారా’’ అంటూ చెప్పాడు ప్రదీప్‌. ఇప్పటికే ఈ చిత్రంలోని గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.