బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌!

నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. వారిలో ఒకరు పూర్ణ. మరొకరు ప్రగ్యా జైస్వాల్‌. ప్రగ్యాకు ముందు ఈ స్థానంలో అక్కినేని ‘అఖిల్’‌ చిత్ర కథానాయిక సాయేషా సైగల్‌ నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తిరిగి ఆ స్థానంలో ప్రగ్యా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈరోజు నుంచి బాలయ్యతో కలిసి ప్రగ్యా సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. రామోజీ ఫిలింసిటీలో సుదీర్ఘమైన షెడ్యూల్‌ని నిర్వహించేందుకు సన్నద్ధమైంది చిత్రబృందం. ఈ రోజు నుంచి మొదలయ్యే షెడ్యూల్‌లో బాలకృష్ణ, జైశ్వాల్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.