సంగీత దర్శకుడు ప్రీతమ్‌ చక్రవర్తి తండ్రి కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ చక్రవర్తి తండ్రి ప్రబోధ్‌ చక్రవర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధితో బాధపుతున్నారు. గత మూడె నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్న ఆయన మే 24న మరణించారు. ఆయన చివరి కర్మలు ముంబైలోని అంబోలిలో జరిగాయి. లాక్‌డౌన్‌ కారణంగా తక్కువమంది కుటంబ సభ్యుల సమక్షంలో లాంఛనాలు జరిగాయి. ప్రస్తుతం ప్రీతమ్‌ చక్రవర్తి అమీర్‌ ఖాన్‌ నటిస్తున్న లాల్‌ సింగ్‌ చద్దాతో పాటు రన్వీర్‌సింగ్‌ ‘83, ఆయన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మస్ర్తా చిత్రాలకు స్వరాలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.