ఇదంతా వాళ్ల వల్లే అంటోన్న ప్రియమణి!

జాతీయ నటి ప్రియమణి నటించిన డిజిటల్‌ చిత్రం ‘అతీత్‌’. ఇందులో ఆమెతో పాటు రాజీవ్‌ ఖండేల్వాల్, సంజయ్‌ సూరి, తదితర నటులు కలిసి నటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘నేను బాగా నటించడానికి నాతోటి నటుల సహకారమే నాకెంతో ఉపయోగపడింది. నేను మొదట హిందీలో నటించిన వెబ్‌ సీరీస్‌ చిత్రం ‘ది ఫ్యామిలి మ్యాన్‌’, ఇందులో మనోజ్‌ బాజ్‌పేయి నటించారు. కానీ ‘ఫ్యామిలి మ్యాన్‌’ షూటింగ్‌ కంటే ముందే ‘అతీత్‌’ చిత్రం చిత్రీకరించారు. సాంకేతికంగా ‘అతీత్‌’ నా మొదటి బాలీవుడ్‌ చిత్రం. ఇక నాతోటి నటులైన రాజీవ్, సంజయ్‌ ఇద్దరి నటన చాలా భిన్నంగా ఉంటుంది. వారితో కలిసి పనిచేయడం ఆసక్తికరమైన సంగతి. ఇక మనోజ్‌ సార్‌ గురించి చెప్పాలంటే ఆయన నటనలో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. ఆయనతో కలిసి నటించేటప్పుడు ఒక విద్యార్థిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పింది. తనూజ్‌ భర్మర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతీత్‌’ చిత్రం కథంతా ఓ సైనికుడి మరణం చుట్టూనే తిరుగుతోంది. ఇందులో ప్రియమణి తల్లి పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి రానా దగ్గుబాటి హీరోగా చేస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా నందితా దాస్‌లు కీలక పాత్రలో నటిస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.