పూరి, సుకుమార్‌ దారిలో కొరటాల?

తెలుగు కథానాయకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారారు. దర్శకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, సుకుమార్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. నూతన నటీనటుల్ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కొరటాల శివ ఈ జాబితాలో చేరనున్నారని టాక్‌. ఎప్పటి నుంచో ఆయనకు ఈ ఆలోచన ఉందని, తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సినిమాలు చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నాడు కొరటాల. కరోనా కారణంగా చిత్రీకరణకు కొంత కాలం విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.