విజయ్‌ దేవరకొండతో కియారా?

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘ఫైటర్‌’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్్సపైకి వెళ్లబోతున్న ఈ చిత్ర కథానాయిక గురించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తుందంటూ ప్రచారం సాగినా.. నటించట్లేదని స్పష్టత ఇచ్చారు బోనీ కపూర్‌. ఆ తర్వాత వేరే కథానాయికల పేర్లు వినిపించినా ఇప్పటి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం మేరకు పూరి జగన్నాథ్‌ నటి కియారా అడ్వాణీని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడట. విజయ్‌- కియారా కలిసి ఓ ప్రకటనలో కలిసి నటించారు. అది పూరిని ఆకట్టుకుందని, అందుకే విజయ్‌ సరసన కియారాను తీసుకునే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. కియారానే ఖరారు చేస్తారా? అంటే కొన్ని రోజుల వేచి చూడాల్సిందే. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి, నటి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.