వారణాసి పయనం?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతోంది. బన్నీఇందులో పుష్పరాజ్‌ పాత్ర పోషిస్తున్నాడు. రష్మిక నాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవలే రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. మరో షెడ్యూల్‌ని డిసెంబరు ద్వియార్థం నుంచి ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈసారి వారణాసిలో చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ కథకు, వారణాసికి సంబంధం ఏంటి? అనేదే ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. బన్నీ-సుకుమార్‌-దేవీశ్రీప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ అంచనాలను మరికొంత పెంచుతోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.