‘రాధేశ్యామ్‌’ కోసం ఇటలీ బయలుదేరిన ప్రభాస్‌

‘సాహో’ నటుడు ప్రభాస్‌ తన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రం షూటింగ్‌ని ఇటలీ చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ప్రభాస్‌ ఈరోజు ఇటలీకి బయలుదేరారు. సూమారు నెలరోజుల పాటు జరిగే షెడ్యూల్లో ఇటలీలోని సుందరమైన ప్రదేశాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోను చిత్రీకరిస్తారని సమాచారం. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం చిత్ర కథానాయిక పూజాహెగ్డే అక్టోబర్‌ 5వ తేదీన ఇటలీకి చేరుకుని అక్టోబర్‌ 10న సెట్స్ లో ప్రత్యక్షం కానుందట. అంతేకాదు సినిమా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకొని చిత్ర యూనిట్‌ నవంబర్‌ మొదటి వారంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారని సినీ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం. ఈ చిత్రం 2021 వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్‌ - వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తిఅయిన తరువాత ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించే అవకాశం కూడా ఉందంటున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రావత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ఆదిపురుష్’లో నటిస్తున్నారు ఇందులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.