కమల్‌ను హీరోగా పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత



జాతీయ నటుడు కమల్‌ హాసన్‌ ప్రధాన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పట్టంపూచి’. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన రఘనాథన్‌ కన్నుమూశారు. 79 సంవత్సరాల రఘునాథన్‌ వృధ్ధాప్య కారణంగా నిన్న చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. కమల్‌ హాసన్‌ తొలుత బాలనటుడిగా ‘కలత్తూర్‌ కన్నమ్మ’ చిత్రంలో వెండితెర అరంగేట్రంగా చేశాడు. ఆతరువాత ఎన్నో చిత్రాల్లో సహాయక పాత్రల్లోను నటించారు. కానీ ప్రధాన కథానాయకుడిగా మాత్రం వచ్చిన చిత్రం ‘పట్టంపూచి’. ఈ సినిమాకి రఘునాథన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈయన ఎంతో మందిని కొత్తవాళ్లని చిత్రసీమకు పరిచయం చేశారు. రఘునాథన్‌ కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.