మరో సినిమా స్టార్ట్‌ చేసిన రాజ్‌తరుణ్‌
యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రంలో నటిస్తున్నాడు. జి.ఆర్‌. కృష్ణ దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాకముందే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత కె.కె. రాధా మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ అనే టైటిల్‌ ఖరారు చేసింది చిత్ర బృందం. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.