ఎన్టీఆర్‌కి సెలవులు ఇచ్చారు!
మ‌ధ్య క‌థానాయ‌కులు మ‌రీ బుద్దిమంతులైపోయారు. కాస్త ఖాళీ దొరికితే... కుటుంబంతో గ‌డ‌ప‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అనే ట్యాగ్‌లైన్ కోసం పోటీ ప‌డుతున్నారు. మ‌హేష్‌బాబు ఈ లిస్టులో ముందువ‌రుస‌లో ఉంటాడు. సినిమా ఇల్లు త‌ప్ప మహేష్‌కి మ‌రో ప్రపంచం తెలీదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ ల‌క్ష‌ణాల్ని పుణికి పుచ్చుకున్నాడు. ఎప్పుడు షూటింగులో బిజీగా ఉండే ఎన్టీఆర్‌.. త‌న‌కు వీలైన‌ప్పుడ‌ల్లా కుటుంబానికీ సమ‌యం కేటాయిస్తున్నాడు.


ప్రస్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నాడు తార‌క్‌. రాజ‌మౌళి సినిమా అంటే రాత్రీబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డాల్సిందే. సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో కూడా తెలీదు. అడిగినన్ని కాల్షీట్లు ఇవ్వాల్సిందే. అలాంట‌ప్పుడు మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ వ‌స్తే.. ఎవ‌రికైనా వేస‌వి సెల‌వ‌లు వ‌చ్చినంత సంబ‌రంగా ఉంటుంది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ న‌డుస్తోంది. అందుకే.. ఈ సెల‌వ‌ల్ని స‌ద్వినియోగ ప‌ర‌చుకోవాల‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. త‌న కుటుంబంతో క‌ల‌సి స‌ర‌దాగా దుబాయ్ విహార‌యాత్రకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అర్థాంగి ప్రణీత, త‌న‌యుడు అభ‌య్‌ల‌తో స‌హా దుబాయ్ ట్రిప్‌కి వెళ్ల‌బోతున్నాడు ఎన్టీఆర్‌. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ ఎన్టీఆర్ దుబాయ్‌లోనే ఉంటాడ‌ని టాక్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.