రజనీకాంత్‌ చిత్రంలో విలన్‌గా జాకీష్రాఫ్‌!

ఒకరు సూపర్‌స్టార్‌ హీరో రజనీకాంత్‌ కాగా మరొకరు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీష్రాఫ్‌. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజనీకాంత హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించిన షూటింగ్‌ గత ఏడాది డిసెంబర్‌ 18న ప్రారంభమైంది. చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రతినాయకుడి పాత్ర హీరో పాత్రకి ధీటుగా ఉంటుందట. ఇప్పటి వరకు చిత్రంలో ప్రతినాయకుడు ఎవరనే విషయం బయటలకు పొక్కలేదు. చిత్రంలో చాలామంది మహిళ నటీమణులు ఉన్నారు. వారిలో కీర్తి సురేష్, నయనతార మీనా, ఖుష్బు సుందర్‌లు. సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, వేల రామ్మూర్తి, సతీష్‌, సూరిలు నటిస్తున్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ మొదలుపెట్టనున్నారు. చిత్రాన్ని వచ్చే పొంగల్ పండగ నాటికి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. అనుకున్న సమయానికి తెరపైకి వస్తుందో రాదో తెలియాలంటే మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, వెట్రీ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. చిత్రానికి శివ, ఆదినారాయణలు కలిసి కథ అందించగా కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.