నాకేం కాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నాను
'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' డాక్యుమెంటరీ చిత్రీకరణలో తనకు పెద్దగా గాయాలేమీ కాలేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. షూటింగ్‌ చేస్తుండగా.. చెట్టు కొమ్మలు, చిన్న ముళ్లు గీసుకున్నాయని అంతకు మించి గాయాలేమీ కాలేదని స్పష్టం చేశారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని..తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. షూటింగ్‌ అనంతరం మంగళవారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు.


'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' పేరిట ఒక ఆంగ్ల ఛానల్‌ తీస్తున్న డాక్యుమెంటరీలో నటించేందుకు కర్ణాటకలోని గుండ్లుపేట అటవీ ప్రాంతానికి రజనీకాంత్‌ వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీతో డాక్యుమెంటరీ తీసిన బేర్‌ గ్రిల్స్‌తోనే తాజా కార్యాక్రమాన్ని రూపొందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.