మనుషులే బాధ్యతగా ప్రవర్తించడం లేదు

‘‘ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేస్తుండాలి’’ అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘‘కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూస్తుంటే బాధేస్తోంది. కానీ మన దేశంలో అంతటి ప్రమాదకర పరిస్థితులు లేనందుకు భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రకృతి నిత్యం తన విధులు నిబద్ధతతో చేసుకుపోతుంటుంది. కానీ, మనం ఏమాత్రం కృతజ్ఞతా భావం చూపించకుండా మితిమీరిన చర్యలతో దానికి అపకారం చేస్తున్నాం. అందుకే ఈ అనర్థాలన్నీ. కాబట్టి ఇక నుంచైనా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతా భావంతో మెలగాలి’’ అని చెప్పింది రకుల్‌. ఆమె ప్రస్తుతం కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘భారతీయుడు 2’లో నటిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.