‘భారతీయడు2’ సెట్లో రకుల్‌ప్రీత్‌


శంకర్‌ - కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్‌ చిత్రం ‘భారతీయుడు2’. ఈ సినిమాలో తారాగణం భారీగానే ఉంది. అందులో కీలక పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. ప్రస్తుతం రకుల్‌ ‘భారతీయుడు2’ సెట్స్‌లో ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. రకుల్‌ ఒకానొక సందర్భంలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..కమల్‌హాసన్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటించమని అడిగిననప్పుడు ఎంతో థ్రిల్‌కి గురయ్యాను. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతందా అని ఎదరుచూస్తున్నానంటూ’’ చెప్పకొచ్చింది. రకుల్‌ ఇందులో సేనాపతి మనవడిగా నటిస్తున్న సిద్ధార్థ్‌తో కలిసి నటించనుంది. ఇంకా చిత్రంలో కాజల్, ఐశ్వర్య రాజేష్, విద్యుత్‌ జమ్వాల్, దిల్లీ గణేష్‌ తదితరులు నటిస్తున్నారు. శుభకరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా, రవివర్మ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. చిత్రాన్ని తమిళ ఉగాది పర్వదినమైన మార్చి 14, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలసిందే.
  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.