పేదలకు రకుల్‌ సాయం


కరోనా నేపథ్యంలో సినీ నటి రకుల్‌ పీత్ర్‌సింగ్‌ తనవంతు చేయూతకి ముందుకొచ్చింది. గుర్గావ్‌లోని తన ఇంటికి సమీపంగా ఉన్న ఓ మురికివాడలోని రెండువందల కుటుంబాల పేదలకు నిత్యావసర వస్తువులను అందించడానికి సిద్ధమైంది. వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ‘‘లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఈ చిన్న సాయం చేయడానికి సిద్ధమయ్యాను. అత్యవసర సమయంలో మనం తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఇది’’ అని చెబుతోంది. ప్రస్తుతం రకుల్‌ ‘భారతీయుడు2’ చిత్రంలో నటిస్తోంది. హిందీలో అజయ్‌ దేవగణ్, సిదార్థలతో కలిసి ‘థ్యాంక్‌ గాడ్‌’లో సమీరా గోయెంగా పాత్రలో నటిస్తోంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.