‘పెటాతో చేయికలపనున్న రకుల్ ప్రీత్‌ సింగ్‌!


ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ప్రపంచ పర్యావరణ అవగాహన కోసం పనిచేశారు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా చేరింది. జూన్‌ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోవత్సవానికి సంబంధించి పెటా ఇండియా తరపున రకుల్ ప్రీత్‌ సింగ్‌ పాల్గొంటోంది. ఇప్పుడు అదే విషయాన్ని రకుల్‌ ప్రీత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘‘పెటా ఇండియా తరపున ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రచారం చేయడంగా చాలా ఉత్సుకతగా ఉంది. త్వరలోనే మీ ముందుకొస్తాను ’’అంటూ పేర్కొంది. రకుల్‌కి జంతువులంటే చాలా ప్రేమ. అప్పుడప్పుడు వాటి ఫోటోలను కూడా తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటోంది. ఇటీవలే రకుల్ ప్రీత్ శాఖహారిగా మారిందట. గతంలో రకుల్‌కి ముక్కలేనిదే ముద్దదిగేది కాదట. వెజిటెబుల్‌ కూరలంటే పెద్దగా ఇష్టముండదట. అలాంటిది గత కొన్నాళ్ల క్రితం శాఖహారిగా మారిందట. ఇది ఒకరోజులో తీసుకున్న నిర్ణయం కాదట. మొత్తం మీద రకుల్‌ మాంసాహారి నుంచి శాఖహారిగా మారింది అని చెప్పడానికి నిదర్శనం జూన్ 5న ‘పెటా’ తరపున ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి మద్దతు తెలపడమే. రకుల్ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగులో చంద్రశేఖర్‌ ఏటేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇక తమిళంలో కమల్‌హాసన్‌తో కలిసి ‘ఇండియన్‌ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ రెండు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.