పది మంది కోసం ఆలోచిద్దాం..

‘‘బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని’’ ప్రజలకు పిలుపునిస్తున్నారు కథానాయకుడు రామ్‌. కరోనా నియంత్రణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ.. బాధ్యతతో మెలగాలని సామాజిక మాధ్యమాల వేదికగా అవగాహన కల్పిస్తున్నారు రామ్‌. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ‘‘చైనాలో ఎవరో ఏదో తినడం వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం దానికి మూల్యం చెల్లిస్తోంది. ఇప్పుడిక్కడ మనం బయట తిరగడం ద్వారా ఇతరులకు ముప్పు తెచ్చే పరిస్థితులు తీసుకురావద్దు. కరోనాను నియంత్రించడానికే ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించింది. దీనిని అర్థం చేసుకోని బాధ్యతగా ప్రవరిస్తూ.. ప్రభుత్వం చెప్పినట్లుగా ఇంటికే పరిమితమవుదాం. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. వీలైనంత వరకు ఆన్‌లైన్‌ సేవల్ని వినియోగించుకుందాం. ఓ పని చేసే ముందు పదిసార్లు ఆలోచిద్దాం.. పది మంది కోసం ఆలోచిద్దాం’’ అని ఆ వీడియో ద్వారా పిలుపునిచ్చారు రామ్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.