రామ్‌చరణ్‌తో వంశీ పైడిపల్లి?

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ కలిసి ఇప్పటికే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం సెట్స్‌మీద ఉండగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని సినీ వర్గాల సమాచారం. గతంలో రామ్‌చరణ్‌ వంశీ రూపొందించిన ‘ఎవడు’ చిత్రంలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే! ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. గుజరాత్‌ షూటింగ్‌ జరపుకుంటున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్లో రామ్‌చరణ్‌కు ఈ మధ్య చిన్న గాయమైంది. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు, చరణ్‌ సరసన అలియాభట్‌ కథానాయిక. వంశీ ప్రస్తుతం మహష్‌బాబుతో ‘మహర్షి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూజాహేగ్డే కథానాయిక. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.