‘రొమాంటిక్‌’లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతికా శర్మ కథానాయిక. ఈ చిత్రానికి పూరి కథ, కథనం అందించడమే కాదు, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు రామ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల గోవాలో ‘రొమాంటిక్‌’ షూటింగ్‌ జరిగింది. అక్కడే రామ్‌కి సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. రామ్‌ - పూరి కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మంచి విజయాన్ని అందుకుంది. ‘రొమాంటిక్‌’లోనూ రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’గానే కనిపిస్తారని సమాచారం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.