మూడోసారి?

రామ్‌ - కిషోర్‌ తిరుమల ఇద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధమయ్యారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘నేను శైలజ’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు కిషోర్‌ తిరుమల. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి పనిచేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఈసారి ఓ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బిజీగా ఉన్నారు. జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాతే కొత్త సినిమా పట్టాలెక్కుతుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.